హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు

Double-decker bus in Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని అనువైన ప్రాంతాల్లో తొలుత వీటిని నడుపుతారు. ఆ తర్వాత మరిన్ని బస్సులను హైదరాబాద్‌లో నడపడంతో పాటు రాష్ట్రంలోని ముఖ్యమైన పట్టణాల్లోనూ వీటిని ప్రవేశపెడుతారు.

Advertisement
Update:2022-12-26 08:28 IST

హైదరాబాద్‌లో ప్రయాణికుల కోసం డబుల్ డెక్కర్ బస్సులు రాబోతున్నాయి. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడంతో పాటు ఆక్యుపెన్సీని పెంచేందుకు ఆర్టీసీ ఈ దిశగా అడుగులు వేస్తోంది.

ఇందులో భాగంగా నగరంలో డబుల్ డెక్కర్ బస్సులను ప్రవేశపెడుతున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. తొలిదశలో ప్రయోగాత్మకంగా 10 డబుల్ డెక్కర్ బస్సులను తీసుకొస్తున్నారు.

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలోని అనువైన ప్రాంతాల్లో తొలుత వీటిని నడుపుతారు. ఆ తర్వాత మరిన్ని బస్సులను హైదరాబాద్‌లో నడపడంతో పాటు రాష్ట్రంలోని ముఖ్యమైన పట్టణాల్లోనూ వీటిని ప్రవేశపెడుతారు. కొన్ని దశాబ్దాల క్రితం హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి.

రద్దీని తట్టుకోవడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల కోసం ఆర్టీసీ అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పలు రకాల బస్సులనూ నడుపుతోంది.

Tags:    
Advertisement

Similar News