డబుల్ బెడ్ రూమ్ పంపిణీ పండగ.. ఈనెల 27న ఆన్ లైన్ డ్రా

ఈ నెల 27వ తేదీన నిర్వహించే ఆన్ లైన్ డ్రా లో 3,4 విడతలకు సంబంధించి 21 వేల మంది లబ్దిదారులను ఎంపిక చేస్తారు అధికారులు. అక్టోబర్ 2వ తేదీన 10,500 మందికి, అక్టోబర్ 5వ తేదీన మరో 10,500 మందికి ఇళ్లను పంపిణీ చేస్తారు.

Advertisement
Update:2023-09-24 00:59 IST

GHMC పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ మూడు, నాలుగో విడతలకోసం రంగం సిద్ధమైంది. ఈ రెండు విడతల్లో మొత్తం 21వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పత్రాలు అందజేస్తారు. ఈ 21వేలమంది ఎంపిక తుది దశకు చేరుకుంది. లబ్ధిదారుల ఎంపిక కోసం ఈనెల 27వ తేదీన హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ర్యాండోమైజేషన్ పద్దతిలో ఆన్ లైన్ డ్రా నిర్వహిస్తారు. ఈమేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ ప్రకటన విడుదల చేశారు. .


ఈ నెల 27వ తేదీన నిర్వహించే ఆన్ లైన్ డ్రా లో 3,4 విడతలకు సంబంధించి 21 వేల మంది లబ్దిదారులను ఎంపిక చేస్తారు అధికారులు. అక్టోబర్ 2వ తేదీన 10,500 మందికి, అక్టోబర్ 5వ తేదీన మరో 10,500 మందికి ఇళ్లను పంపిణీ చేస్తారు. దీంతో 3, 4 విడతలు పూర్తవుతాయి. ఈ ఆన్ లైన్ డ్రా కి సంబంధించి GHMC కమిషనర్ రొనాల్డ్ రాస్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ తో మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు.

విజయవంతంగా రెండు విడతలు..

ఇప్పటికే 2 విడతలలో జీహెచ్ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ పూర్తయింది. మొత్తం 24,900 మందికి ఇళ్లను పంపిణీ చేశారు నేతలు, అధికారులు. తొలి రెండు విడతల్లో కూడా లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగింది. అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధుల సమక్షంలోనే NIC రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా ర్యాండోమైజేషన్ పద్దతిలో ఆన్ లైన్ డ్రా నిర్వహించారు. 3, 4 విడతలకు సంబంధించి కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News