కులగణన సర్వేపై ఎలాంటి అపోహలు వద్దు
సర్వే వల్ల కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టవచ్చన్న పొన్నం ప్రభాకర్
కుల గణన సర్వే ఎవరికీ వ్యతిరేకం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని దోభిఘాట్ గ్రౌండ్‌ను ఆయన పరిశీలించారు. అక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. దోభిఘాట్ గ్రౌండ్‌ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అభివృద్ధి చేస్తున్నదని చెప్పారు. కులగణన సర్వేలో బ్యాంకు ఖాతా వివరాలు అడగడం లేదని మంత్రి స్పష్టం చేశారు. కులం వివరాలు చెప్పడం ఇష్టం లేకుంటే 999 ఆప్షన్ ఉంటుందని పేర్కొన్నారు. ఎన్యూమరేటర్లను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే 30 శాతం కులగణన సర్వే పూర్తయిందన్నారు. సర్వేపై ఎలాంటి అపోహలు వద్దన్నారు. రాజకీయ కుట్ర చేసేవారే వీటిని సృష్టిస్తున్నారని చెప్పారు. కులగణన సర్వే వల్ల కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టవచ్చని పొన్నం ప్రభాకర్ తెలిపారు.