భాషను మతంతో ముడిపెట్టడం మూర్ఖత్వం -కేటీఆర్

ఉర్దూ భాషను మతంతో ముడిపెట్టరాదని టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కొందరు మూర్ఖులు ఈ భాషను కేవలం ఒక మతానికి సంబంధించినదిగా ప్రొజెక్ట్ చేస్తున్నారని, విచ్చిన్న రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

Advertisement
Update:2022-07-16 18:53 IST

ఉర్దూ భాషను మతంతో ముడిపెట్టరాదని టీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. కొందరు మూర్ఖులు ఈ భాషను కేవలం ఒక మతానికి సంబంధించినదిగా ప్రొజెక్ట్ చేస్తున్నారని, విచ్చిన్న రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. బహదూర్ పల్లిలో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. తెలంగాణాలో ఏ మతానికి చెందినవారైనా చాలామంది ఉర్దూ భాషను అనర్గళంగా మాట్లాడుతారని, దీన్ని రాస్తారు కూడానని చెప్పారు. తమ గ్రాండ్ పేరెంట్స్ ఉర్దూను చక్కగా మాట్లాడేవారని ఆయన తెలిపారు.

ప్రధాని మోడీ కొన్ని నిధులను మంజూరు చేసి ఈ భాషను ప్రమోట్ చేస్తుండగా తెలంగాణలోని ఆ పార్టీ (బీజేపీ) నాయకులు మాత్రం ఉర్దూను కేవలం ముస్లిములు మాట్లాడే భాషగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. మన ఊరు-మన బడి కార్యక్రమానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మధుయాష్కీ గౌడ్ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేశారని ఆయన అన్నారు. ఒకే ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఒకరిపక్కన ఒకరు కూర్చున్న వీరు ఒకే మైక్ పట్టుకుని వేర్వేరు కామెంట్స్ చేశారని అన్నారు. . 'మన ఊరు-మనబడి కార్యక్రమానికి ఒక్క రూపాయి కూడా మంజూరు కాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. అయితే ఆయన పక్కనే కూర్చున్న మధు యాష్కీ గౌడ్.. నిధులను మళ్లించారని, స్కామ్ జరిగిందని వ్యాఖ్యానించారు,, ఇది పరస్పర విరుద్ధంగా ఉంది' అని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరానికి గాను ఈ పథకానికి తెలంగాణ ప్రభుత్వం 3,497 కోట్లను కేటాయించిందని ఆర్ధిక మంత్రి హరీష్ రావు గత మార్చిలో అసెంబ్లీకి సమర్పించిన తమ బడ్జెట్లో పేర్కొన్నారు.




Tags:    
Advertisement

Similar News