అభివృద్ధి, సంక్షేమం ఓర్వలేకనే బీఆర్‌ఎస్ విమర్శలు
గవర్నర్ ప్రసంగాన్ని సైతం బీఆర్‌ఎస్ అవహేళన చేసిందని ప్రభుత్వ విప్‌ల ఆగ్రహం;
అభివృద్ధి, సంక్షేమం ఓర్వలేకనే బీఆర్‌ఎస్ విమర్శిస్తున్నదని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధినే గవర్నర్ చెప్పారని, కానీ సభలో ఆయన ప్రసంగాన్ని సైతం బీఆర్‌ఎస్ అవహేళన చేసిందని మండిపడ్డారు. గులాబీ నేతలు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సరిచేస్తున్నామని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. ఏడాదిలోనే రూ. 54 వేల కోట్లు రైతులకు అందించామని, 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు తప్పకుండా ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. గవర్నర్ ప్రసంగం ప్రజలకు చేరకుండా బీఆర్‌ఎస్ కుట్రలు చేసిందని మరో విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. అసెంబ్లీ 60 పని దినాల్లో చుక్క తెగిపడినట్లు కేసీఆర్ ఒక్కరోజు వచ్చారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ముందు మార్కులు కొట్టేయడానికి కుమారుడు, కుమార్తె, అల్లుడు పోటీ పడ్డారని సెటైర్ వేశారు.