పోలీసు రాజ్యం చేద్దామనుకుంటున్నారా?

ఎమ్మెల్యే సంజయ్‌ పదవికి రాజీనామా చేసి పోటీ చేసి గెలవాలని బీఆర్‌ఎస్‌ నేతలు గంగుల కమలాకర్‌, రసమయి బాలకిషన్‌ల సవాల్‌

Advertisement
Update:2025-01-13 17:28 IST

ప్రశ్నిస్తే కేసులు పెట్టడం ఇందిరమ్మ రాజ్యమా? అని బీఆర్‌ఎస్‌ నేతలు ప్రశ్నించారు. ఎమ్మెల్యే సంజయ్‌ పదవికి రాజీనామా చేసి పోటీ చేసి గెలవాలని బీఆర్‌ఎస్‌ నేతలు గంగుల కమలాకర్‌, రసమయి బాలకిషన్‌లు సవాల్‌ చేశారు. ప్రజాప్రతినిధులు పరస్పరం విమర్శించుకోవడం సాధారణమే అయినా కేసులు పెట్టడం సరికాదని మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. అధికార సమీక్షా సమావేశంలోకి వచ్చి ఓ ఎమ్మెల్యేను పోలీసులు బైటికి తీసుకెళ్లడం దారుణమన్నారు. అసెంబ్లీలో కూడా స్పీకర్‌ అనుమతిస్తే మార్షల్‌ వచ్చి సభకు ఆటంకం కలుగుతున్నదని ఆ ఎమ్మెల్యేను తీసుకెళ్తారు. స్థానిక సంస్థల సమావేవంలో గాని, జిల్లా సమీక్ష సమావేశంలో ఆహ్వానిత ఎమ్మెల్యేను పోలీసులు స్టేజ్‌ ఎక్కి గుంజుకపోవడం అన్నది ఇంతవరకు ఎక్కడా జరగలేదన్నారు. ఇది చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ముగ్గురు మంత్రులు ఉండి ఎందుకు నియంత్రించలేదని గంగుల ప్రశ్నించారు. పోలీసు రాజ్యం చేద్దామనుకుంటున్నారా? అని నిలదీశారు. కౌశిక్‌రెడ్డి అడిగిన దాంట్లో తప్పేమున్నదని అడిగారు.

మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ..జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్.. నీకు సిగ్గు శరం ఉంటే వెంటనే బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. నువ్వు ఇవ్వాళా స్పీకర్ కు ఇవ్వాల్సింది ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మీద ఫిర్యాదు కాదు.. దమ్ముంటే నీ రాజీనామా లెటర్ ఇవ్వు అని సవాల్‌ విసిరారు. 

Tags:    
Advertisement

Similar News