హాస్టల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. డైట్ చార్జీలు పెంపు

తెలంగాణ గురుకులాల విషయంలో మాత్రం సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ముందుగానే నిర్ణయం తీసుకున్నారు. డైట్ చార్జీలను పెంచి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.

Advertisement
Update:2023-07-22 23:01 IST

తెలంగాణలో గురుకులాల సంఖ్యను భారీగా పెంచి, పేద విద్యార్థుల చదువులకు బంగారుబాట వేసిన సీఎం కేసీఆర్.. సౌకర్యాల విషయంలో కూడా వారికి గతంలో ఎప్పుడూ లేనంత సాయం చేస్తున్నారు. తాజాగా గురుకుల హాస్టల్ విద్యార్థుల డైట్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. సంబంధిత ఫైల్ పై సీఎం కేసీఆర్ ఈరోజు సంతకం చేశారు. పెంచిన డైట్ చార్జీలను ఈ నెలనుంచే అమలవుతాయి, పెంపుకి తగ్గట్టుగా మరింత నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందుబాటులోకి వస్తుంది.

డిమాండ్ రాకమునుపే..

సహజంగా డైట్ చార్జీలు పెంచాలంటూ విద్యార్థుల నుంచి డిమాండ్లు వచ్చిన తర్వాత ఎప్పటికో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కానీ తెలంగాణ గురుకులాల విషయంలో మాత్రం సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ముందుగానే నిర్ణయం తీసుకున్నారు. డైట్ చార్జీలను పెంచి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.


డైట్ చార్జీల పెంపు ఎలాగంటే..?

3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు గురుకుల హాస్టల్ లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రస్తుతం నెలకు రూ. 950 డైట్ చార్జీలకు కేటాయించగా, దాన్ని రూ.1200 కు పెంచారు.

8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం డైట్ చార్జీలు రూ.1100 ఉండగా, దాన్ని రూ.1400 కు పెంచారు.

ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి పీజీ వరకు ప్రస్తుతం 1500 రూపాయలుగా ఉన్న డైట్ చార్జీని 1875 రూపాయలకు పెంచారు. 

Tags:    
Advertisement

Similar News