స్వగ్రామాలకు నగరవాసులు.. మెట్రో రైళ్లలో రద్దీ
పండగకు వెళ్లే వారితో మెట్రో రైళ్లలో కిటకిట
Advertisement
సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ నగరవాసులు స్వగ్రామాలకు బయలుదేరారు. నేటి నుంచి వరుస సెలవులు ఉండటంతో సొంతూళ్లకు తరలివెళ్తున్నారు. పండగకు వెళ్లే వారితో మెట్రో రైళ్లలో రద్దీ నెలకొన్నది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎల్బీనగర్, మియాపూర్, సికింద్రాబాద్, ఎంజీబీఎస్, జేబీఎస్ తదితర ప్రాంతాలకు చేరుకోవడానికి మెట్రో రైళ్లలో ప్రయాణిస్తున్నారు. మియాపూర్, రాయదుర్గం, జేఎన్టీయూ, అమీర్‌పేట్, ఎంజీబీఎస్, పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర స్టేషన్ల వద్ద రద్దీ నెలకొన్నది.
Advertisement