పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు..31 రైళ్ల రద్దు

10కి పైగా రైళ్లను పాక్షికంగా రద్దు

Advertisement
Update:2024-11-13 09:33 IST

పెద్దపల్లి జిల్లాలో గూడ్స్‌ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. దక్షిణ మధ్య రైల్వే 31 రైళ్లు రద్దు చేయడంతోపాటు 10కి పైగా రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. నర్సాపూర్‌-సికింద్రాబాద్‌, సికింద్రాబాద్‌-నాగ్‌పూర్‌, హైదరాబాద్‌-సిర్పూర్‌ కాగజ్‌నగర్‌, సికింద్రాబాద్‌-కాగజ్‌నగర్‌, కాజిపేట-సిర్పూర్‌టౌన్‌, సిర్పూర్‌ టౌన్‌-కరీంనగర్‌, కరీంనగర్‌-బోధన్‌, సిర్పూర్‌టౌన్‌-భద్రాచలం రోడ్‌, భద్రాచలం రోడ్‌-బల్లార్షా, బల్లార్షా-కాజీపేట, యశ్వంత్‌పూర్‌-ముజఫర్‌పూర్‌, కాచిగూడ-నాగర్‌సోల్‌, కాచిగూడ-కరీంనగర్‌, సికింద్రాబాద్‌-రామేశ్వరం, సికింద్రాబాద్‌-తిరుపతి, ఆదిలాబాద్‌-పర్లి, అకోలా-పూర్ణ, ఆదిలాబాద్‌-నాందేడ్‌, నిజామాబాద్‌-కాచిగూడ, గుంతకల్లు-బోధన్‌ రైళ్లను రద్దు చేశారు.ఐరన్‌ కాయిల్స్‌తో వెళ్తున్న రైలు ఓవర్‌ లోడ్‌తో 11 వ్యాగన్లు బోల్తాపడ్డాయి.ట్రిపుల్‌ లైన్‌ మద్య నుంచి వెళ్తున్న గూడ్స్‌ అప్‌, డౌన్‌ మార్గాలపై బోల్తా పడింది. ఈరైలు బళ్లారి నుంచి ఘజియాబాద్‌ వెళ్తున్నది.

పట్టాలు తప్పిన గూడ్స్‌ రైల్‌ పునరుద్ధరణ పనులు రాఘవపూర్‌ సమీపంలో యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి. రైల్‌ ట్రాక్‌పై బోల్తాపడిన గూడ్స్‌ డబ్బాలు, విరిగిపడిన సిగ్నల్స్‌, పట్టాలను తొలిగిస్తున్నారు. తెగిపడిన విద్యుత్‌ తీగలను పునరుద్ధరిస్తున్నారు. కొత్త పట్టాలను ఘటన స్థలానికి తెప్పించి సిబ్బంది శరవేగంగా పట్టాలను అమర్చుతున్నది. అధికారులు వందలాదిమంది సిబ్బందితో పునరుద్ధరణ పనులు శరవేగంగా నిర్వహిస్తున్నారు. రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ ఘటన స్థలం వద్ద దగ్గరుండి పనులు చేయిస్తున్నారు. 


Tags:    
Advertisement

Similar News