నటి కంగనా రనౌత్‌కు డిప్యూటీ సీఎం మాస్ వార్నింగ్
ఎమర్జెన్సీ సినిమాపై తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ఎమర్జెన్సీ సినిమాలో నటిస్తున్న కంగనా రనౌత్‌పై విమర్శలు చేశారు.
దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్బంగా నెక్లెస్ రోడ్ లోని పివి మార్క్ వద్ద ఉన్న ఇందిరా విగ్రహానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతు ఇందిరా గాంధీపై నెగటివ్ సినిమాల తీసిన నటి కంగన రౌత్‌కు కౌంటర్ ఇచ్చారు. దేశ సమగ్రతపై అవగాహన లేని వారు, గతం గురించి తెలియని వారు ఇందిర చరిత్రను వక్రీకరిస్తారని అన్నారు. గతం గురించి తెలిసిన వారు ఇందిరా గాంధీకి చేతులెత్తి నమస్కరిస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. మసమాజ స్థాపన కోసం 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలు ఆమె తీసుకుందని ఉద్ఘాటించారు. దేశాన్ని గొప్ప అగ్రగామిగా నిలబెట్టేందుకు చాలా నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. అనేక వర్గాలను ఒకే తాటిపై నడిపిన ఘనత ఇందిరా గాంధీది అని కొనియాడారు. దేశ సుస్థిరత కోసం ప్రాణాలు సైతం ఫణంగా పెట్టిన ఘనత ఉక్కు మహిళ ఇందిరా గాంధీది అని గుర్తుచేశారు. ఇందిరా గాంధీ ఈ దేశంలో పుట్టడం మనకు గర్వకారణమని అన్నారు.
ఇందిరా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా సంస్కరణలు తీసుకు వచ్చిందని గుర్తుచేశారు. ఆమె స్పూర్తితో రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకోని వస్తామని ఉద్ఘాటించారు. దేశ సమగ్రత కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని భట్టి కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు దానం నాగేందర్, అనిరుధ్ రెడ్డి, నాయకులు విజయా రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. అటు గాంధీభవన్ లో జరిగిన ఇందిరా గాంధీ జయంతిలోనూ వారు పాల్గొని చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీకి, దేశానికి ఇందిరాగాంధీ చేసిన సేవలను, బలిదానాన్ని స్మరించుకున్నాకు. ఇందిరా స్ఫూర్తితో కాంగ్రెస్ శ్రేణులు దేశ ప్రగతిలో పునరంకితం కావాలన్నారు