ఎఫ్‌టీఎల్‌లో ప్రజలు నివాసం ఉంటున్నభవనాలను కూల్చం

హైడ్రా ఏర్పాటు తర్వాత జరుగుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చేస్తామని హైడ్రా కమిషనర్‌ ప్రకటన

Advertisement
Update:2024-12-24 21:07 IST

చెరువులకు సంబంధించిన వివరాలను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ తెలిపారు. గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా బఫర్‌ జోన్లను గుర్తించే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ... హైడ్రా ఏర్పాటునకు ముందు ఇచ్చిన అనుమతులు చెల్లుతాయన్నారు. ఆ తర్వాత జరుగుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చుతామని స్పష్టం చేశారు. కాలనీ సంఘాలు చేస్తున్న ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఎఫ్‌టీఎల్‌లో ప్రజలు నివాసం ఉంటున్న ఎలాంటి భవనాలను కూల్చబోమన్నారు. అక్రమ నిర్మాణాలపైనే హైడ్రా చర్యలు ఉంటాయని రంగనాథ్‌ వెల్లడించారు. 

Tags:    
Advertisement

Similar News