ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురు

సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరణ

Advertisement
Update:2024-10-03 12:43 IST

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు హైకోర్టులో చుక్కెదురైంది. దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులకు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. బీఆర్‌ఎస్‌ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే ఇవ్వడానికి డివిజన్‌ బెంచ్‌ నిరాకరించింది.

అనర్హత పిటిషన్‌లపై పత్రాల పరిశీలన, విచారణ తేదీలు నిర్ణయించాలి. తేదీలు నిర్ణయించి స్పీకర్‌ టేబుల్‌పై పెట్టాలి. నెల రోజుల్లోగా తేదీలు నిర్ణయించి హైకోర్టు రిజిస్ట్రార్‌కు ఇవ్వాలని అసెంబ్లీ కార్యదర్శిని హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. సింగిల్‌ బెంచ్‌ తీర్పును సవాల్‌ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్‌ దాఖలు చేశారు. సింగిల్‌ బెంచ్‌ తీర్పుపై స్టే విధించాలని అప్పీల్‌లో కోరారు. స్టే ఇవ్వడానికి నిరాకరించిన హైకోర్టు ధర్మాసనం ఈ నెల 20న వాదనలు వింటామని పేర్కొన్నది.

Tags:    
Advertisement

Similar News