అక్కను చంపింది చెల్లెలే.. దీప్తి హత్య కేసులో అసలు నిజాలివి

చెల్లెలు చందన, ఆమె ప్రియుడు ఉమర్ కదలికలను కోరుట్ల పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో పసిగట్టిన పోలీసులు కేసుని ఛేదించారు. ఇందులో ఉమర్ కుటుంబ సభ్యుల పాత్ర, మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉందని తేల్చారు.

Advertisement
Update:2023-09-02 17:40 IST

ఇటీవల కోరుట్లలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ దీప్తి హత్యకేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అక్క హత్యకు కారణం చెల్లెలే అనే అనుమానాలున్నా.. ఆ విషయం నిర్థారణ అయ్యే వరకు అంతా సస్పెన్స్ గా మారింది. అయితే పోలీసులు ఎట్టకేలకు ఈ కేసు ఛేదించారు. చెల్లెలు చందన, ఆమె బాయ్ ఫ్రెండ్ ఉమర్ సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు. జగిత్యాల ఎస్పీ భాస్కర్ ఈ కేసు వివరాలన్నీ మీడియాకు తెలియజేశారు.

అసలేం జరిగింది..?

జగిత్యాల జిల్లా కోరుట్లలో గతనెల 29న జరిగిన దీప్తి హత్య సంచలనంగా మారింది. తల్లిదండ్రులిద్దరూ హైదరాబాద్ వెళ్లిన సమయంలో ఇంట్లో అక్క దీప్తి, చెల్లెలు చందన ఇద్దరే ఉన్నారు. అక్క దీప్తి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది. చెల్లెలు చందన బీటెక్ చదువుతూ డిటైన్డ్ అయింది. హత్య జరిగిన రోజు రాత్రి ఇద్దరితో తల్లిదండ్రులు ఫోన్లో మాట్లాడారు, తెల్లవారిన తర్వాత ఇద్దరి ఫోన్లూ పనిచేయకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెంది పక్కింటివారికి ఫోన్ చేయగా దీప్తి హత్య వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చూస్తే దీప్తి శవం ఇంట్లో ఉంది, చందన మిస్ అయింది. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. వారి ఇంట్లో ఖాళీ మద్యం సీసాలు కనిపించడంతో మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. అక్కను చంపి చెల్లెలు తన ప్రియుడితో వెళ్లిపోయిందనే పుకార్లు చివరకు నిజమయ్యాయి.

పారిపోతూ, ప్రాణం తీశారు..

తల్లిదండ్రులు లేని సమయంలో అక్కకు తెలియకుండా నగలు, నగదు, ప్రియుడితో కలసి పారిపోవాలని చూసించి చందన. అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. అక్కని మద్యం మత్తులో ఉంచగలిగింది కానీ, చందన ప్రియుడు ఉమర్ నగలు తీసుకెళ్లడం ఆమె గమనించింది. దీంతో ఆమె నోటికి ప్లాస్టర్లు వేసి, చున్నీతో ఆమెను కట్టిపడేసి గందరగోళం చేశారు. దీంతో ఆమె చనిపోయింది. చెల్లెలు, ఆమె ప్రియుడు ఉమర్ కదలికలను కోరుట్ల పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో పసిగట్టిన పోలీసులు కేసుని ఛేదించారు. ఇందులో ఉమర్ కుటుంబ సభ్యుల పాత్ర, మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉందని తేల్చారు. 

Tags:    
Advertisement

Similar News