'ఉద్యమకారుడి బిడ్డ‌ ఎప్పుడూ భయపడదు’ ...ఫ్లెక్సీల హల్చల్

మహిళా రిజర్వేష‌న్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్ తో కవిత ఈ రోజు ఢిల్లీలో దీక్ష చేపట్టారు. మరో వైపు కవిత అభిమానులు హైదరాబాద్ లో ఆమెకు మద్దతుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

Advertisement
Update:2023-03-10 10:24 IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో విచారణకు రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులిచ్చిన నేపథ్యంలో 'ఉద్యమకారుడి బిడ్డ‌ ఎప్పుడూ భయపడదు’ అంటూ కవిత, కేసీఆర్ ఫోటోలతో హైదరాబాద్ లో ఫ్లెక్సీలు వెలిశాయి.

మహిళా రిజర్వేష‌న్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలనే డిమాండ్ తో కవిత ఈ రోజు ఢిల్లీలో దీక్ష చేపట్టారు. మరో వైపు కవిత అభిమానులు హైదరాబాద్ లో ఆమెకు మద్దతుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

''Daughter Of Fighter Will Never Fear'' (ఉద్యమకారుడి బిడ్డ‌ ఎప్పుడూ భయపడదు’ ) అనే ఫ్లెక్సీలు, బ్యానర్లు హైదరాబాద్ నగరంలో కవిత అభిమానులు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో కేసీఆర్, కవిత పిడికిలి బిగించి ఉన్న ఫొటోలను ముద్రించారు. అంతేకాదు.. ‘ఇండియాను బీజేపీ చెర నుంచి రక్షించాలి.. మేమంతా కవితక్క వెంటే ఉంటాం’ అని ఆ ఫ్లెక్సీల్లో ప్రింట్ చేశారు కవిత ఫ్యాన్స్. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్‌తో పాటు పంజాగుట్ట, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

మోడీ పాలనలో దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక‌ పరిస్థితి దారుణంగా దిగజారిన నేపథ్యంలో దేశాన్ని కాపాడేందుకు కేసీఆర్ నడుం బిగించడంతోనే బీజేపీ ఇలా కక్షపూరిత చర్యలకు దిగిందని ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత వీరాభిమాని అరవింద్ అలిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, రోజు రోజుకు కేసీఆర్ ప్రతిష్ట దేశ‌వ్యాప్తంగా పెరుగుతోందని చెప్పిన అరవింద్, కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే బీజేపీ కుట్ర పూరిత రాజకీయాలకు తెరలేపింద‌ని మండిపడ్డారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా, ఎంత మందిని జైళ్ళకు పంపినా బీఆరెస్ పార్టీదే తుది విజయమని అరవింద్ ధీమా వ్యక్తం చేశారు.


Tags:    
Advertisement

Similar News