హైడ్రా కూల్చివేతలుపై దాసోజు శ్రవణ్ ఫైర్..ప్రజల కళ్లల్లో రక్తాన్ని చూస్తుండ్రు

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలుపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక రాష్ట్రం రాజ్యాంగబద్దంగా పని చేయాలన్నారు.

Advertisement
Update:2024-09-22 17:25 IST

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలుపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక రాష్ట్రం రాజ్యాంగబద్దంగా పని చేయాలన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నిరంకుశత్వ మూర్ఖత్వంతో కురచ బుద్దితో పేద ప్రజల కళ్ళల్లో రక్తాన్ని చూస్తుండని విమర్శించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారం ఇస్తే రేవంత్‌రెడ్డి జనాలకు కన్నీళ్లు పెట్టిస్తున్నరని ఇది ముమ్మాటికీ రాక్షసత్వమే అని పేర్కొన్నారు. వాళ్ల అధికారం అధికారం కోసం, ప్రాబల్యం కోసం సీఎం చేతిలో కీలుబొమ్మగా ఆయన చేపడుతున్న రాజ్యాంగ వ్యతిరేక విధ్వంసక చర్యలకు హైడ్రా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.

ఇవాళ నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆదివారం కూకట్ పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. మరోవైపు సంగారెడ్డి జిల్లాలోని అమీన్ పూర్ లో పటేల్ గూడ గ్రామంలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. దీంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. 

Tags:    
Advertisement

Similar News