గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా దానాకిషోర్
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
Advertisement
గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానాకిషోర్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ స్పెషల్ సీఎస్‌గా పని చేస్తున్న బుర్ర వెంకటేశంను ప్రభుత్వం ఇటీవలే టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించింది. దీంతో ఆయన స్థానంలో దానాకిషోర్‌కు పోస్టింగ్ ఇచ్చారు. బుర్ర వెంకటేశం విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పని చేశారు. ఆ పోస్టులో ఇంకా ఎవరినీ నియమించలేదు.
Advertisement