కాంగ్రెస్ పాలనలో కర్ఫ్యూలు, మతకల్లోలాలే : సీఎం కేసీఆర్

ఈ శతాబ్ధంలోనే అత్యంత ప్రశాంతంగా తెలంగాణ ఉన్నది గత పదేళ్లే. ఒక పంచాయితీ లేదు.. ఒక లొల్లిలేదు.. అందరం మంచిగా ఉన్నాం.

Advertisement
Update:2023-11-07 18:39 IST

తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉన్నది. ఎలాంటి కర్ఫ్యూలు, మతకల్లోలాలు లేకుండా ప్రశాంతమైన పాలనను అందించామని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, మాట్లాడుతూ..

ఈ శతాబ్ధంలోనే అత్యంత ప్రశాంతంగా తెలంగాణ ఉన్నది గత పదేళ్లే. ఒక పంచాయితీ లేదు.. ఒక లొల్లిలేదు.. అందరం మంచిగా ఉన్నాం. అందరం కలిసిమెలిసి బతుకుతున్నామని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు తెల్లారిలేస్తే మతకల్లోలాలతో అల్లాడేది. ఎప్పుడుబడితే అప్పుడు కర్ఫ్యూ ఉండేది. ఆ పంచాయితీలకు, కర్ఫ్యూలకు కారకులు ఎవరో ఒక సారి ప్రజలు ఆలోచించాలని కోరారు. రాజకీయాల్లో రాయి ఏదో, రత్నం ఏదో గుర్తు పట్టాలి. ప్రతీ పార్టీ వైఖరి ఎలా ఉంటుందో చాలా ముఖ్యమని కేసీఆర్ చెప్పారు.

పెద్దపల్లి నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న దాసరి మనోహర్ రెడ్డిని గెలిపించాలని కేసీఆర్ కోరారు. గతంలో మీరు ఎమ్మెల్యేగా గెలిపించారు. ఆయన విద్యావేత్త, నిస్వార్థంగా పని చేసే వ్యక్తి. పదేళ్లలో ఏనాడూ వ్యక్తిగత పనుల గురించి అడగలేదు. కేవలం నీళ్ల గురించే మాట్లాడాడని కేసీఆర్ చెప్పారు. రైతుల గురించే గత కొన్నేళ్లుగా తపన పడిన వ్యక్తి మనోహర్ రెడ్డి అని కేసీఆర్ అన్నారు.

మనోహర్ రెడ్డికి డ్రామాలు, నాటకాలు వేసుడు రావు. అమరికరలు లేకుండా నిజాయితా ఉంటాడు. దొంగ ధర్నాలు, దొంగ దీక్షలు చేయడం ఆయనకు రాదని కేసీఆర్ చెప్పారు. మీ మధ్య ఉండే మనోహర్ రెడ్డిని తప్పకుండా గెలిపించుకోవాలని కోరారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రతీ ఊరికి రూ.40 లక్షలు పెట్టి చెట్లు పంపిణీ చేసిన వ్యక్తి మనోహర్ రెడ్డి అని కేసీఆర్ చెప్పారు. మరోసారి ఆయనను గెలిపించి.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని మరింత ముందుకు తీసుకొని వెళ్దామని కేసీఆర్ చెప్పారు.

Tags:    
Advertisement

Similar News