క్రికెటర్ సిరాజ్‌కు డీఎస్సీ పోస్టు..నియామక పత్రాలు అందించిన డీజీపీ
హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం డీఎస్పీ పోస్టు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ జితేందర్ సిరాజ్‌కు డీఎస్పీ నియామక పత్రాలు అందించారు.
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌కు తాజాగా తెలంగాణ ప్రభుత్వం డీఎస్పీ పోస్టు కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ జితేందర్ సిరాజ్‌కు డీఎస్పీ నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సర్కార్‌కు, పోలీసు శాఖకు సిరాజ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ క్రికెట్ భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు, గౌరవాన్ని తెచ్చాడంటూ మొహమ్మద్ సిరాజ్‌ను సీఎం రేవంత్ అభినందించారు. భారత ప్లేయర్‌గా ఏడేండ్లుగా సేవలు అందిస్తుండటమేకాక, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ టీమిండియా గెలుపు బృందంలో సిరాజ్ ఉన్నారు.
ఆ తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టిన సిరాజ్‌కు హైదరాబాద్‌లో క్రికెట్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సిరాజ్‌ను సన్మానించింది. క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు నెలలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని సిరాజ్‌కు కేటాయిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.