కాంగ్రెస్‌ను భయపెడుతున్న సీపీఎం.. ఆ 10స్థానాల్లో దెబ్బ తప్పదా..?
కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో రాష్ట్రంలోని 19 స్థానాల్లో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగింది. దీంతో కాంగ్రెస్‌లో కలవరం నెలకొంది. కనీసం 10 స్థానాల్లో కాంగ్రెస్‌ను సీపీఎం గట్టి దెబ్బ కొట్టబోతోందనే చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్ పార్టీని సీపీఎం భయపెడుతోంది. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సీపీఎం పార్టీ కాంగ్రెస్‌ను గట్టి దెబ్బ కొట్టబోతోందనే చర్చ జరుగుతోంది. ఖమ్మం జిల్లా పాలేరు, కొత్తగూడెం.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గాల్లో సీపీఎం కీలకంగా వ్యవహరించబోతోంది. పాలేరులో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వయంగా పోటీ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోందనే చర్చ జరుగుతోంది.
నల్లగొండ నియోజకవర్గంలో సీపీఎం అభ్యర్థి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి పోటీలో ఉన్నారు. దాంతో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విజయావకాశాలకు గండి పడే అవకాశాలు ఉన్నాయని టాక్. నకిరేకల్‌లోనూ సీపీఎం వల్ల కాంగ్రెస్ అభ్యర్థి వేముల వీరేశంకు ఓటమి తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మిర్యాలగూడలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి బరిలో ఉండటంతో బత్తుల లక్ష్మారెడ్డికి ఓటమి తప్పేలా లేదనే చర్చ నడుస్తోంది.
కొత్తగూడెంలో సీపీఐ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంది. కానీ, జలగం వెంకట్రావు ఫార్వార్డ్ బ్లాక్ నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావుకు అంత ఈజీ కాదనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో రాష్ట్రంలోని 19 స్థానాల్లో సీపీఎం ఒంటరిగా బరిలోకి దిగింది. దీంతో కాంగ్రెస్‌లో కలవరం నెలకొంది. కనీసం 10 స్థానాల్లో కాంగ్రెస్‌ను సీపీఎం గట్టి దెబ్బ కొట్టబోతోందనే చర్చ జరుగుతోంది.