రేణుక బెయిల్‌కి నో చెప్పిన న్యాయస్థానం..
మరోపక్క ఈ కేసులో ఇటీవల అరెస్టయిన ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ కేసులో ఏ-3గా ఉన్న రేణుక బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. కేసు విచారణ దశలో ఉన్నందున ఆమెకు బెయిల్ ఇవ్వకూడదని సిట్ తరఫు న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఆమెకు బెయిల్ ఇస్తే.. విచారణను ప్రభావితం చేసే అవకాశముందని న్యాయవాది చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం ఈ మేరకు ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది.
తనకు ఆరోగ్యం బాగోలేదని, తన పిల్లల బాగోగులు చూసుకునేవారు కూడా లేరని, తనకు బెయిల్ మంజూరు చేయాలని రేణుక నాంపల్లి న్యాయస్థానంలో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొంది. పేపర్ లీకేజీతో తనకు ప్రత్యక్ష ప్రమేయం లేదని ఆమె తెలిపింది. తనపై కేవలం నేరాభియోగాలు మాత్రమే ఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్‌లో కోరింది. ఇరుపక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి ఆమె బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు.
మరోపక్క ఈ కేసులో ఇటీవల అరెస్టయిన ప్రశాంత్, రాజేందర్, తిరుపతయ్యలను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సిట్ అధికారులు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ముగించిన నాంపల్లి న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించే అవకాశముంది.