సమ్మెతో పత్తి రైతులు ఇబ్బందులు పడవద్దు

సీసీఐ, జిన్నింగ్‌ మిల్లుల యజమానుల మధ్య ఉన్న విభేదాలు తొలిగించుకుని పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని మంత్రి విజ్ఞప్తి

Advertisement
Update:2024-11-11 14:14 IST

తెలంగాణలో తక్కువ ధరకు పత్తి పంటను విక్రయించే పరిస్థితులు తలెత్తకూడదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలో జిన్నింగ్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ సమ్మె ప్రకటించిన నేపథ్యంలో మంత్రి తుమ్మల స్పందించారు. ఈ సమ్మె నేపథ్యంలో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సీఎండీ, సీఎస్‌తో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. సమ్మె కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిన్నింగ్‌ మిల్లర్లతో చర్చలు జరపాలన్నారు. వారి డిమాండ్లను పరిష్కరిస్తూ తక్షణమే పత్తి కొనుగోళ్లు పునః ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇది రైతుల ప్రయోజనాలను కాపాడటంలో అత్యంత కీలకమని స్పష్టం చేశారు. సీసీఐ, జిన్నింగ్‌ మిల్లుల యజమానుల మధ్య ఉన్న విభేదాలు తొలిగించుకుని పత్తి కొనుగోళ్లు ప్రారంభించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. 

ఆదిలాబాద్‌ వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు స్తంభించాయి. ముందస్తు సమాచారం ఇవ్వకుండా వ్యాపారులు కొనుగోళ్లను నిలిపివేశారు.సీసీఐ అధికారులు, వ్యాపారులు కుమ్మక్కై కొనుగోళ్లను ఆపేశారని మండిపడ్డారు. పత్తి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. దీనిపై సీసీఏ అధికారులు, రాజకీయ నేతలు స్పందించడం లేదని వాపోతున్నారు. తిండి లేకుండా ఎంత సేపు వేచి చూడాలంటున్నారు. పత్తి తీసుకొచ్చిన వెహికిల్స్‌కు డబుల్‌ ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందంటున్నారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా పత్తి కొనుగోలు చేయమంటే మేం చేయాలి అని నిలదీస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News