కాంగ్రెస్‌లో ఆగని లొల్లి.. సూర్యాపేటలో రచ్చరచ్చ

శుక్రవారం రాత్రి సూర్యాపేట నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డి, సీనియర్ నేత జానా రెడ్డి హాజరయ్యారు.

Advertisement
Update: 2024-04-20 05:20 GMT

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్‌లో వర్గపోరు ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ పరిధిలోని పాలకుర్తి, పరకాలతో పాటు ఇటీవల వనపర్తి మీటింగ్‌లలో విబేధాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. ఈ గొడవలు మరువక ముందే.. సూర్యాపేటలోనూ సీన్ రిపీట్ అయింది.

శుక్రవారం రాత్రి సూర్యాపేట నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డి, సీనియర్ నేత జానా రెడ్డి హాజరయ్యారు. ఐతే వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో దామోదర్ రెడ్డి ఫోటో పెట్టి.. పటేల్ రమేష్‌ రెడ్డి ఫోటో వేయకపోవడం వివాదానికి దారి తీసింది. దీంతో పటేల్ వర్గీయులు వేదిక ముందు ఆందోళనకు దిగారు. పటేల్ రమేష్ రెడ్డికి కార్యక్రమానికి ఆహ్వానం సైతం పంపలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో పటేల్ వర్గీయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జానారెడ్డి. అతి చేస్తే మర్యాద ఇచ్చేది లేదంటూ పటేల్ వర్గీయులపై మండిపడ్డారు. ఉంటే ఉండండి.. లేదంటే వెళ్లిపోవాలంటూ పటేల్ వర్గీయులపై ఫైర్ అయ్యారు జానారెడ్డి.

Tags:    
Advertisement

Similar News