వెలమ కులస్థులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
వెలమ నా కొడుకుల్లారా అంటూ సంపి తీరుతాం అంటు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ హాట్ కామెంట్స్ చేశారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. వెలమ నా కొడకల్లరా మిమ్మల్ని చంపి తీరుమతామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెల్వకుండా వెలమ నా కొడుకుల అంతు చూస్తామని హాట్ కామెంట్స్ చేశారు. ఒక్కొక్కని వీపు బాషింగాలు కడతామని హెచ్చరించారు.
వెలమ కులస్థులు బయట తిరుగకుండా చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై కుట్రలు పన్నితే.. దాడులు చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులం అంతా.. నేరుగా దాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కబడ్ధార్ అంటూ షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక వెలమ కులస్తులపై షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన వ్యాఖ్యలపై ఆ కులస్థులు ఆగ్రహిస్తున్నారు.