తెలంగాణలో భారీ పెట్టుబడికి ముందుకొచ్చిన 'కంట్రోల్ ఎస్'
రూ. 10 వేల కోట్లతో పెట్టుబడితో 400 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు అంగీకారం
రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టడానికి మరో కంపెనీ ముందుకు వచ్చింది. రూ. 10 వేల కోట్లతో పెట్టుబడితో కంట్రోల్ ఎస్ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ కంపెనీతో ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకున్నది. హైదరాబాద్‌లో 400 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. డేటా సెంటర్ క్లస్టర్‌లో 3,600 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మంత్రి శ్రీధర్‌బాబు, కంట్రోల్ ఎస్ సీఈవో శ్రీధర్ సమక్షంలో ఒప్పందాలు జరిగాయి.ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ రాష్ట్రంలో మరో మైలురాయి అన్నారు.
హెచ్‌సీఎల్ సీఈవో సీఎం కీలక భేటీ
హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ విజయ్‌కుమార్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఈ చర్చలో మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.హైటెక్ సిటీలో హెచ్‌సీఎల్ 3.2 లక్షల చదరపు అడుగుల్లో క్యాంపస్ నిర్మిస్తున్నది. కొత్త క్యాంపస్‌తో 5 వేల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఫిబ్రవరిలో దీన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రిని హెచ్‌సీఎల్ ఎండీ కోరారు. తెలంగాణలో ఆ సంస్థ సేవల విస్తరణను సీఎం రేవంత్‌రెడ్డి స్వాగతించారు.