కేసీఆర్‌ హెల్త్‌పై దుష్ప్రచారం.. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్‌ ఫైర్

కేసీఆర్ ఆరోగ్యంపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్‌ తీవ్రంగా స్పందించింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక వాట్సాప్‌ ఛానల్‌ ఫేక్ న్యూస్‌కు అడ్డాగా మారిందంటూ మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు.

Advertisement
Update:2024-08-16 15:23 IST

రాజకీయాల్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు కామన్‌. సవాళ్లు, ప్రతిసవాళ్లు సర్వ సాధారణం. కానీ, ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది. అయితే ఒక వ్యక్తి నాశనం కోరుకోవడం, తద్వారా పైశాచిక ఆనందం పొందడం రాజకీయాల్లో హుందాతనం అనిపించుకోదు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విషయంలో కాంగ్రెస్‌ సోషల్‌ మీడియా ఇదే తీరును కనబరుస్తోంది. కేసీఆర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారంటూ ఓ ఫేక్ వార్తను సోషల్‌మీడియాలో వైరల్ చేస్తోంది.


కేసీఆర్‌ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, గత 12 రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, యశోద‌ వైద్యులు గజ్వేల్‌లో ఎమర్జెన్సీ యూనిట్‌ను ఏర్పాటు చేసి ఆయన ఆరోగ్యాన్ని 24 గంటలు పర్యవేక్షిస్తున్నారనేది ఆ వార్త సారాంశం. అత్యాధునిక చికిత్స అందించేందుకు పరికరాలను సైతం ప్రత్యేకమైన అంబులెన్స్‌లో ఫామ్‌హౌస్‌కు తరలించారని, హాస్పిటల్‌లో చేర్చితే ఎమ్మెల్యేలు పార్టీ మారతారని, పార్టీ శ్రేణులు కూడా గందరగోళానికి గురవుతాయని, అందుకే ఆయన హాస్పిటల్‌లో చేర్చట్లేదనే వార్తను కాంగ్రెస్ సోషల్‌మీడియా ప్రచారం చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్‌ అధికారిక వాట్సాప్‌ ఛానల్‌లోనే ఈ వార్తను షేర్ చేయడం గమనార్హం.

అయితే కేసీఆర్ ఆరోగ్యంపై జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బీఆర్ఎస్‌ తీవ్రంగా స్పందించింది. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసింది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారిక వాట్సాప్‌ ఛానల్‌ ఫేక్ న్యూస్‌కు అడ్డాగా మారిందంటూ మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. రుణమాఫీ పేరుతో చేసిన మోసంతో ప్రజల్లో ఆగ్రహం మొదలవుతుందని గ్రహించే, అటెన్షన్ డైవర్షన్‌ కోసం కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతోందంటూ పైర్ అవుతున్నారు. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత నీచ స్థితికి దిగజారదంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News