ఆ ముగ్గురికి బీ-ఫామ్‌ ఇవ్వొద్దు.. కాంగ్రెస్‌ షాకింగ్ డెసిషన్‌..!

విడ‌త‌ల వారీగా100 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌.. మరో 19 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఓ వైపు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సైతం ఇప్పటికే ప్రారంభమైంది.

Advertisement
Update:2023-11-05 16:15 IST

ఆ ముగ్గురికి బీ-ఫామ్‌ ఇవ్వొద్దు.. కాంగ్రెస్‌ షాకింగ్ డెసిషన్‌..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం 100 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్‌.. మూడు స్థానాల్లో అభ్యర్థులను మార్చబోతుందని ప్రచారం జరుగుతోంది. మిగిలిన 97 మంది అభ్యర్థులకు బీఫామ్‌లు అందించాలని.. ముగ్గురికి బీఫామ్‌లు ఆపాలని అధిష్టానం ఆదేశించిన‌ట్లు సమాచారం.

బీ-ఫామ్‌ ఆపాలని చెప్పిన నేతల్లో వనపర్తి అభ్యర్థి చిన్నారెడ్డి, బోథ్‌ అభ్యర్థి వన్నెల అశోక్‌, చేవెళ్ల అభ్యర్థి భీం భరత్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. చిన్నారెడ్డి స్థానంలో శివసేనా రెడ్డి లేదా మెగా రెడ్డికి అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చేవెళ్ల నుంచి భీం భరత్ ప్లేస్‌లో సిద్దేశ్వర్ పేరును పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ఇక బోథ్‌ అభ్యర్థిగా ప్రకటించిన వన్నెల అశోక్‌కు సైతం షాకిస్తారని తెలుస్తోంది. ఆయనకు సైతం బీ-ఫామ్ ఇవ్వొద్ద‌ని కాంగ్రెస్‌ పెద్దలు చెప్పినట్లు సమాచారం. ఆయన స్థానంలో నరేష్ జాదవ్ పేరును పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. విడ‌త‌ల వారీగా100 మంది అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన కాంగ్రెస్‌.. మరో 19 నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఓ వైపు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సైతం ఇప్పటికే ప్రారంభమైంది. ఈనెల 10 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

Tags:    
Advertisement

Similar News