ఈనెల 26న ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్.. టీకాంగ్ ని నమ్మేదెలా..?
చేవెళ్లలో ఈనెల 26న ప్రజా గర్జన బహిరంగసభ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ కార్యక్రమానికి వస్తారు. ఆయన సమక్షంలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేయాలనుకుంటోంది రాష్ట్ర నాయకత్వం.
ఆమధ్య రైతు డిక్లరేషన్ అంటూ తెలంగాణ కాంగ్రెస్ హడావిడి చేసింది. అక్కడ సీన్ కట్ చేస్తే వ్యవసాయానికి 3 గంటలు కరెంటు చాలంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని పూర్తిగా డ్యామేజీ చేశాయి. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ చిత్తశుద్ధి ఏపాటిదో చూడండి అంటూ బీఆర్ఎస్ నేతలు విరుచుకుపడ్డారు. వర్షాలతో రైతుల ప్రదర్శనకు బ్రేక్ పడింది కానీ.. లేకపోతే రైతు వేదికల వద్ద కాంగ్రెస్ ని తిడుతూ బీఆర్ఎస్ చేపట్టిన నిరసనలు నిరాటంకంగా కొనసాగేవి. తాజాగా ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ మరో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు మొదలు పెట్టింది. ఈసారి ఏమవుతుందో చూడాలి.
చేవెళ్లలో ఈనెల 26న ప్రజా గర్జన బహిరంగసభ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ కార్యక్రమానికి వస్తారు. ఆయన సమక్షంలో ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ విడుదల చేయాలనుకుంటోంది రాష్ట్ర నాయకత్వం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఇన్ పుట్స్ అన్నీ తీసుకున్నారు. ప్రజా గర్జన విజయవంతం కోసం టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశం గాంధీ భవన్ లో నిర్వహించింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా ఇతర కీలక నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.
తిరగబడదాం..
నెల రోజుల పాటు ‘తిరగబడదాం.. తరిమి కొడదాం’కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని కాంగ్రెస్ నాయకులు నిర్ణయించారు. గ్రామాల్లో ప్రతి ఇంటి తలుపు తట్టి, కాంగ్రెస్ పార్టీ ఆయా వర్గాలకు చేసిన మేలు వివరించాలని నాయకులకు సూచించారు రేవంత్ రెడ్డి. సెప్టెంబర్ 17న పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తామని, అప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేయబోయే కార్యక్రమాలను కూడా ప్రజలకు వివరించాలని కోరారు. కర్నాటక తరహాలోనే కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు స్కీంలను కూడా ప్రతి ఇంటికి చేర్చే బాధ్యతను పార్టీ కేడర్ తీసుకోవాలని పిలుపునిచ్చారు మాణిక్ రావు ఠాక్రే.