రేవంత్ సాక్షిగా తన్నుకున్న కాంగ్రెస్ లోని రెండు వర్గాలు

రేవంత్ రెడ్డి తన 'హాత్ సే హాత్ జోడో' యాత్రలో భాగంగా ఈ రోజు గాంధారిలో ఒక రోజు దీక్షకు కూర్చుంటున్నారు. దీక్ష ఇంకొద్ది సేపట్లో ప్రారంభమ‌వుతుందనగా ఎల్లా రెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు సుభాష్ రెడ్డి, మదన మోహన్ రావు వర్గాల నాయకులు, అనుచరులు ఘర్షణకు దిగారు.

Advertisement
Update:2023-03-19 13:14 IST

కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు లేని రోజు ఉండదు. ఎక్కడోచోట ప్రతిరోజు వర్గాల కుమ్ములాటలు జరుగుతూనే ఉంటాయి.ఇక తెలంగాణ వర్గ పోరుకు పరాకాష్టగా నిలిచింది. పీసీసీ స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు వర్గాలు, వర్గపోరులు అతి మామూలు విషయమే. ఈ రోజు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముందే రెండు వర్గాలు ఘర్షణపడ్డాయి.

రేవంత్ రెడ్డి తన 'హాత్ సే హాత్ జోడో' యాత్రలో భాగంగా ఈ రోజు గాంధారిలో ఒక రోజు దీక్షకు కూర్చుంటున్నారు. దీక్ష ఇంకొద్ది సేపట్లో ప్రారంభమ‌వుతుందనగా ఎల్లా రెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు సుభాష్ రెడ్డి, మదన మోహన్ రావు వర్గాల నాయకులు, అనుచరులు ఘర్షణకు దిగారు.

నియోజక వర్గంలో రేవంత్ రెడ్డి యాత్రకు, దీక్షకు అన్ని ఏర్పాట్లు చేసింది సుభాష్ రెడ్డి. అయితే దీక్ష స్థలానికి మదన్ మోహన్ వర్గీయులు రావడంతో గొడవ మొదలయ్యింది. మదన్ మోహన్ వర్గానికి చెందిన రాజు అనే వ్యక్తిని సుభాష్ రెడ్డి వర్గీయులు అక్కడికి రానీయ లేదు. ఇక్కడ గొడవలు సృష్టించడానికే వచ్చారంటూ రాజును, ఆయనతో వచ్చిన మరికొంత మందిని వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. దాంతో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది.

ఇరువర్గాలను సముదాయించిందేకు రేవంత్ ప్రయత్నించినా వారు ఆగకపోగా ఒకరితో ఒకరు ముష్టి యుద్దానికి దిగారు. రేవంత్ సుభాష్ రెడ్డి వర్గానికి మద్దతు ఇస్తున్నారని మదన్ మోహన్ రావు వర్గీయిలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    
Advertisement

Similar News