లోక్ సభ ఎన్నికల లోపు ఆరు గ్యారెంటీలు కష్టమే..!

అసెంబ్లీ ఎన్నికల విజయం గాలివాటు కాదని నిరూపించుకోవాలంటే లోక్ సభ ఫలితాల్లో కూడా కాంగ్రెస్ సత్తా చూపించాల్సి ఉంటుంది. అందుకే గ్యారెంటీలను హడావిడిగా మొదలు పెట్టకుండా, వాటి అమలులో ఫెయిలయ్యారనే మాట రానీయకుండా జాగ్రత్తపడుతున్నారు కాంగ్రెస్ నేతలు.

Advertisement
Update:2024-01-27 08:22 IST

6 గ్యారెంటీలు..

ఆ పేరుతో ఇచ్చిన 13 హామీలు..

శాంపిల్ గా 2 హామీలను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం లోక్ సభ ఎన్నికల లోపు మిగతా 11 హామీలను కచ్చితంగా అమలు చేయాలని, ఆ ప్రక్రియ ప్రారంభించాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే 100 రోజుల డెడ్ లైన్ పెట్టిన కాంగ్రెస్ మాత్రం కులాసాగా ఉంది. ఆలోగా ఎన్నికల కోడ్ వస్తుందని, వాయిదా వేసినా ప్రజల్లో వ్యతిరేకత రాదనేది వారి ఆలోచన. ప్రస్తుతం ప్రజా పాలన దరఖాస్తుల వడపోత జరుగుతోందంటూ అప్పటి వరకూ టైమ్ గడిపేందుకే కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు. మరీ ఒత్తిడి వస్తే ఒకటిరెండు హామీలను ఫిబ్రవరిలో అమలు చేస్తారు.

అధికారిక లీకులు..

ప్రస్తుతం ఇందిరమ్మ ఇళ్లకోసం వచ్చిన దరఖాస్తుల వడపోత ప్రక్రియ జరుగుతోందని ప్రభుత్వమే అధికారుల ద్వారా చెప్పిస్తోంది. ఈ వడపోతకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను వాడుతున్నారని కూడా అంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం 84 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇళ్ల స్థలాలకోసం, ఇంటి నిర్మాణం కోసం దరఖాస్తులు వచ్చాయి. ఒకే కుటుంబం రెండు మూడు దరఖాస్తులు ఇచ్చిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ వడపోసి లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి అర్హతలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తారు. ఒకవేళ ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని ఇప్పటికిప్పుడు ప్రకటించినా నిధులు విడుదలవడానికి కనీసం 6 నెలలు పడుతుంది. అందుకే ఇలాంటి పథకాలను ప్రస్తుతం ప్రకటించేయాలని చూస్తోంది ప్రభుత్వం.

ప్రతిపక్షాల ఒత్తిడి..

అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలనేవి కాంగ్రెస్ కి లాభం చేకూర్చాయి. లోక్ సభ ఎన్నికల్లో కూడా అవే గ్యారెంటీలు హైలైట్ అయ్యే అవకాశముంది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలంగాణకు మరింత మేలు జరుగుతుందని, గ్యారెంటీల అమలులో ఆర్థిక కష్టాలు రావంటూ కాంగ్రెస్ ప్రచారం మొదలు పెట్టబోతోంది. దీంతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. ఎన్నికల కోడ్ వచ్చేలోగా గ్యారెంటీలు అమలు చేయాల్సిందేనంటూ పట్టుబడుతోంది. 100 రోజుల డెడ్ లైన్ ని గుర్తు చేస్తోంది.

ప్రతిపక్షాలు ఒత్తిడి తెచ్చినా కూడా కాంగ్రెస్ నేతలు మాత్రం రిలాక్స్ గానే ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆరు గ్యారెంటీలే తమను రక్షిస్తాయని అనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల విజయం గాలివాటు కాదని నిరూపించుకోవాలంటే లోక్ సభ ఫలితాల్లో కూడా కాంగ్రెస్ సత్తా చూపించాల్సి ఉంటుంది. అందుకే గ్యారెంటీలను హడావిడిగా మొదలు పెట్టకుండా, వాటి అమలులో ఫెయిలయ్యారనే మాట రానీయకుండా జాగ్రత్తపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. 

Tags:    
Advertisement

Similar News