దోకేబాజీ పార్టీ, 420 మేనిఫెస్టో.. ఫీలయిన కాంగ్రెస్

బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీని కించపరిచేలా కేసీఆర్, హరీష్ రావు మాట్లాడారని ఈసీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. వరంగల్ బహిరంగ సభలో కాంగ్రెస్‌ ను కేసీఆర్, దోకేబాజీ పార్టీ అన్నారని, కేసీఆర్ వ్యాఖ్యలు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని ఫిర్యాదు చేశారు.

Advertisement
Update:2023-11-18 18:32 IST

కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఫీలయ్యారు. తమ పార్టీని సీఎం కేసీఆర్ కించపరిచారని నొచ్చుకున్నారు. తమ మేనిఫెస్టోని హరీష్ రావు తీసిపడేశారని తెగ ఇదైపోయారు. ఆ వెంటనే ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావుపై ఎన్నికల కమిషన్ సీఈఓ వికాస్ రాజ్ కి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు.

కించపరుస్తారా..?

బహిరంగ సభల్లో కాంగ్రెస్ పార్టీని కించపరిచేలా కేసీఆర్, హరీష్ రావు మాట్లాడారని ఈసీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. వరంగల్ బహిరంగ సభలో కాంగ్రెస్‌ ను కేసీఆర్, దోకేబాజీ పార్టీ అన్నారని, కేసీఆర్ వ్యాఖ్యలు ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కిందికి వస్తాయని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలయ్యాక.. 420 మేనిఫెస్టో అంటూ హరీష్ రావు చేసిన విమర్శలు కూడా కోడ్‌ ఉల్లంఘన కిందకు వస్తాయన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు కాంగ్రెస్ నేతలు.

ఫిర్యాదుల వెల్లువ..

ఈసారి తెలంగాణ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఎన్నికల ప్రచార ప్రకటనలపై కూడా వరుస ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులతోనే కొన్ని ప్రకటనలపై ఈసీ నిషేధం విధించింది. ప్రజల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రచారంలో పాల్గొనకుండా ఆయనపై నిషేధం విధించాలని కోరారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా కేసీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలపై ఈసీ ముందు పంచాయితీ పెట్టింది. 

Tags:    
Advertisement

Similar News