కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్ఎస్.. రైతుబంధుపై ఏది నిజం..?

ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. అయితే కాంగ్రెస్‌ విమర్శలకు కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది బీఆర్ఎస్. రైతుబంధుపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన అంశాన్ని సాక్ష్యాధారాలతో సహ ట్వీట్ చేసింది.

Advertisement
Update:2023-11-04 09:06 IST

రైతుబంధు అంశంపై మరోసారి కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ డైలాగ్‌ వార్‌ కంటిన్యూ అవుతోంది. ఈసారి సోషల్‌మీడియా వేదికగా రెండు పార్టీలు పరస్పర ఆరోపణలకు దిగాయి. రైతు బంధు ఆపాలని కాంగ్రెస్‌ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసిందని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే చీఫ్‌ ఎలక్షన్ ఆఫీసర్‌ శుక్రవారం మాట్లాడుతూ రైతుబంధుకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని, దానిపై పూర్తి సమాచారం లేదని చెప్పారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్‌ను టార్గెట్‌ చేసింది.

ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి ట్వీట్ చేసింది. అయితే కాంగ్రెస్‌ విమర్శలకు కౌంటర్ అటాక్ మొదలుపెట్టింది బీఆర్ఎస్. రైతుబంధుపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన అంశాన్ని సాక్ష్యాధారాలతో సహ ట్వీట్ చేసింది. రైతుబంధు ఆపాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ రాసిన లేఖను ట్విట్టర్‌లో ఉంచింది. సీఈవో వికాస్‌ రాజ్‌ మాట్లాడిన మాటను కూడా తప్పుగా ప్రచారం చేస్తున్నారంటూ ఆయన వీడియోను సైతం బీఆర్ఎస్ ట్విట్టర్‌లో ఉంచింది.


రైతుబంధుకు సంబంధించి మీడియా ప్రశ్న అడగ్గా.. పూర్తి వివరాలు తన దగ్గర లేవని చెప్పారని తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘానికి రైతుబంధుపై ఫిర్యాదు చేసిన టైంలో ఉత్తమ్‌ మాట్లాడిన వీడియోను సైతం బీఆర్ఎస్ పోస్టు చేసింది. మాణిక్‌ రావు ఠాక్రే రాసిన లేఖ అబద్ధమా..లేక మీ ఎంపీ మాట్లాడింది అబద్ధమా అంటూ కాంగ్రెస్‌ను ప్రశ్నించింది


ఇక కాంగ్రెస్‌ తన ట్వీట్‌లో ఉపయోగించిన భాషపై అభ్యంతరం వ్యక్తం చేసింది బీఆర్ఎస్. వ్యక్తిత్వ హననంలోకి దిగాలంటే మేము కూడా అదే భాష వాడగలమంటూ మండిపడింది బీఆర్ఎస్. బ్రోకర్ అధ్యక్షుడయ్యాక సిగ్గులజ్జా అన్ని వదిలేసినట్టున్నారంటూ విమర్శించింది.

Tags:    
Advertisement

Similar News