అది లవ్ స్టోరీ కాదు, పోలీస్ స్టోరీ..!

సాయంత్రం పోలీసులు అసలు విషయం చెప్పేసరికి అందరికీ షాక్ తగిలింది. కానీ అప్పటికే హంగామా చేసి ఉండటంతో తగ్గేది లేదంటూ అబద్ధాలనే మరింత బలంగా చెప్పేందుకు నిర్ణయించుకున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు.

Advertisement
Update:2023-10-15 08:57 IST

అది లవ్ స్టోరీ కాదు, పోలీస్ స్టోరీ..!

పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ప్రవళిక ఆత్మహత్య తెలంగాణలో సంచలనంగా మారింది. గంటల వ్యవధిలోనే ఆమె ఆత్మహత్యకు కారణాన్ని పోలీసులు కనిపెట్టారు. పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయనే బాధతో ఆమె చనిపోలేదని, ప్రియుడు మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకున్నదని తేల్చారు. కానీ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఆ వాదన కొట్టిపారేస్తున్నారు. అది ముమ్మాటికీ లవ్ స్టోరీ కాదని, పోలీస్ స్టోరీ అని అంటున్నారు. పోలీసులే కట్టుకథ అల్లారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.

కవర్ చేసుకోలేక..

ప్రవళిక ఆత్మహత్యతో బీజేపీ, కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయారు. ప్రభుత్వంపై బురదజల్లేందుకు సిద్ధమయ్యారు. రాహుల్ గాంధీతో ఈ వ్యవహారంపై ట్వీట్ కూడా వేయించారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఇక బీజేపీ వాళ్లు తక్కువ తిన్నారా..? ఏకంగా గవర్నర్ తమిళిసై ఈ వ్యవహారంపై సీఎస్, డీజీపీ, TSPSCని నివేదిక అడిగారు. ఎన్నికల వేళ రాజకీయ మంటలు ఎగదోయాలని చూశారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా నానా హంగామా చేశారు, చివరకు సాయంత్రం పోలీసులు అసలు విషయం చెప్పేసరికి అందరికీ షాక్ తగిలింది. కానీ అప్పటికే హంగామా చేసి ఉండటంతో తగ్గేది లేదంటూ అబద్ధాలనే మరింత బలంగా చెప్పేందుకు నిర్ణయించుకున్నారు కాంగ్రెస్, బీజేపీ నేతలు. అసలు కారణం తెలిశాక కూడా తప్పంతా ప్రభుత్వానిదేనంటూ వితండవాదం చేశారు బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ మెంబర్ కె.లక్ష్మణ్

శవరాజకీయాలెందుకు..?

వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్యకు పాల్పడ్డ యువతి మృతి పట్ల సానుభూతి లేకపోగా.. ఓట్లు దండుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ శవ రాజకీయాలు చేస్తోందని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. శవాల మీద పేలాలు ఏరుకునే దరిద్రపుగొట్టు పార్టీ కాంగ్రెస్ అంటూ మండిపడుతున్నారు. బీఆర్ఎస్ విమర్శలకు తగ్గట్టుగానే.. కాంగ్రెస్ కూడా ప్రవళిక మృతిపై మరింతగా రాద్ధాంతం చేయడం విశేషం. వ్యక్తిగత కారణాలే ఆత్మహత్యకు కారణం అంటూ పోలీసులు వివరించినా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం ముందుగా తాము చేసిన ఆరోపణలను కవర్ చేసుకోడానికి మరింతగా విమర్శలు ఎక్కుపెడుతోంది.



Tags:    
Advertisement

Similar News