కాంగ్రెస్‌, సీపీఐ పొత్తు ఫైనల్‌.. ఇవాళ అధికారిక ప్రకటన

సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కిరావడంతో పొత్తుపై ఇవాళ అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పొత్తు ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Advertisement
Update:2023-11-06 07:40 IST

తెలంగాణలో కాంగ్రెస్‌, సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. కొత్తగూడెం నియోజకవర్గం నుంచి సీపీఐ పార్టీ అభ్యర్థి పోటీలో ఉండనున్నారు. ఎన్నికల అనంత‌రం ఓ ఎమ్మెల్సీ పదవి ఇస్తామ‌ని సీపీఐకి కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. మునుగోడులో స్నేహపూర్వక పోటీకి కాంగ్రెస్ అధిష్టానం అంగీకరించలేదు. దీనికి సీపీఐ జాతీయ నాయకత్వం సైతం ఒప్పుకోలేదని సమాచారం.

సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కిరావడంతో పొత్తుపై ఇవాళ అధికారిక ప్రకటన చేస్తారని తెలుస్తోంది. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో పొత్తు ప్రకటన చేయనున్నట్లు సమాచారం. కొడంగల్‌లో నామినేషన్ వేసిన తర్వాత రేవంత్ నేరుగా సీపీఐ కార్యాలయానికి వస్తారని తెలుస్తోంది.

మునుగోడులో స్నేహపూర్వక పోటీ వద్దని కాంగ్రెస్ చెప్పిన నేపథ్యంలో సీపీఐ రెండు ఎమ్మెల్సీలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇవాళ క్లారిటీ రానుంది. మరోవైపు నల్గొండ జిల్లా సీపీఐ కార్యవర్గ సమావేశం మునుగోడులో ఇవాళ నిర్వహించనున్నారు. మునుగోడులో పోటీ చేయాలని పార్టీ నేతలు పట్టుదలతో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News