సమగ్ర కుటుంబ సర్వే 95 శాతం పూర్తి
29.82 లక్షల కుటుంబాల డేటా కంప్యూటరీకరణ
Advertisement
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే బుధవారం నాటికి 95 శాతం పూర్తయిందని ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 1,18,02,726 నివాసాలకు ఈరోజు వరకు 1,10,98,360 నివాసాల నుంచి సమాచార సేకరణ పూర్తయ్యిందని తెలిపారు. ఇంకో 7,04,366 నివాసాల నుంచి సమాచారం సేకరించాల్సి ఉందన్నారు. సర్వేను ముందుగానే పూర్తి చేసిన ములుగు జిల్లా డేటా కంప్యూటరీకరణలోనూ ముందే ఉందని తెలిపారు. ఆ జిల్లాలో 70.3 శాతం డేటా కంప్యూటరీకరించామని, యాదాద్రి భువనగిరి జిల్లా 59.8 శాతం డేటాను కంప్యూటరీకరించి రెండో స్థానంలో ఉందన్నారు. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 29,82,034 డేటాను కంప్యూటరీకరించామని వివరించారు. జీహెచ్‌ఎంసీలో సర్వే 80.5 శాతం పూర్తయిందని తెలిపారు.
Advertisement