నేటి నుంచే సమగ్ర కుటుంబ సర్వే

ఈ నెల 9 నుంచి 75 ప్రశ్నలతో కూడిన వివరాలు సేకరణ

Advertisement
Update:2024-11-06 10:36 IST

రాష్ట్రంలో సమగ్ర కులగణన సర్వేకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ నేతృత్వంలో 85 వేల మంది ఎన్యుమరేటర్లు నేటి నుంచి ఇంటింటి సర్వే చేయనున్నారు. మూడు రోజుల పాటు కుటంబాలను గుర్తించి ఇంటికి స్టిక్కర్లు అంటిస్తారు. ఈ నెల 8వ తేదీ వరకు కుటుంబాలను గుర్తిస్తారు. ఈ నెల 9 నుంచి 75 ప్రశ్నలతో కూడిన వివరాలు సేకరిస్తారు. ఈ సర్వే డేటా ఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలపై సర్వే చేయనున్నారు. విద్య, ఉపాధి, కులాలపై వివరాలను ఎన్యుమరేటర్లు సేకరించనున్నారు. ప్రతి 10 మంది ఎన్యుమరేటర్లకు ఒక సూపర్‌ వైజర్‌ ఉన్నారు. స్వర్వేలో చేసే వారు ప్రాథమిక పాఠశాల టీచర్లు. ఉదయం స్కూళ్లకు హాజరైన తర్వాత మధ్యాహ్నం 1 గంటల నుంచి వారు సర్వేలో పాల్గొంటారు.

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వేకు గ్రేటర్‌ హైదరాబాద్‌ సిద్ధమైంది. గ్రేటర్‌ సిటీ పరిధిలోని సర్వేను హైదరాబాద్‌ ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రారంభించారు. మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ శ్రీలతా రెడ్డి, కలెక్టర్‌ అనుదీప్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.గ్రేటర్‌ పరిధిలో 27 లక్షల 76 వేల ఇండ్లలో సర్వేనిర్వహించనున్నారు. మొత్తం 28 లక్షల 28 వేల ఇండ్లలో ఈ సర్వే కొనసాగనున్నది. ఒక్కో ఎన్యుమరేట్‌కు 150 ఇండ్లు కేటాయించారు. ఏ రోజుకు ఆరోజు సర్వే వివరాలను ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేస్తారు. డోర్‌ లాక్‌ ఉంటే మరోసారి సర్వే వివరాలను సేకరిస్తారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ప్రజల సహకారం ఉంటే కార్యక్రమాలు విజయవంతమవుతాయన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. అందరి సలహాల మేరకు ప్రశ్నలు రూపొందించినట్లు పేర్కొన్నారు. ఇంటింటి సర్వేతో రాష్ట్రం రోల్‌మోడల్‌గా మారబోతున్నదని చెప్పారు. సర్వే సమయంలో ఎలాంటి పత్రాలు స్వీకరించరని తెలిపారు.

సర్వేతో ఎలాంటి కార్డులు పోవు

రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి శ్రీధర్‌ బాబు ప్రారంభించారు. విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయ, ఆర్థిక ప్రణాళికల కోసం సర్వే చేపట్టినట్లు తెలిపారు. రేషన్‌కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులు పోతాయని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల ఎలాంటి కార్డులు పోవని స్పష్టం చేశారు. ఇంటింటి సర్వేకు ప్రజలంతా సహకరించాలని శ్రీధర్‌బాబు కోరారు. 

Tags:    
Advertisement

Similar News