టీ.బీజేపీలో లుకలుకలు.. ఒకరిపై ఒకరు ఫిర్యాదులు

ఇటీవల బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్ర‌ధాని మోడీ బ‌హిరంగ సభలకు దూరంగా ఉన్న ఈ ఇద్దరు నేతలు.. తాజాగా నడ్డా నేతృత్వంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకూ హాజరు కాలేదు.

Advertisement
Update:2023-10-06 17:02 IST

తెలంగాణ బీజేపీలో అంతర్గత విబేధాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీ సీనియర్ నేతలు విజయశాంతి, రాజగోపాల్‌ రెడ్డి.. మరో సీనియర్ నేత ఈటల రాజేందర్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈ ఇద్దరు నేతలు ప్ర‌త్యేకంగా సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్ వ్యవహారశైలిపై విజ‌య‌శాంతి, రాజ‌గోపాల్ ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నడ్డాకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఇటీవల బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ప్ర‌ధాని మోడీ బ‌హిరంగ సభలకు దూరంగా ఉన్న ఈ ఇద్దరు నేతలు.. తాజాగా నడ్డా నేతృత్వంలో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకూ హాజరు కాలేదు. పార్టీ అనుబంధ కమిటీల్లో పదవుల కేటాయింపుపై విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

కొంతకాలంగా పార్టీ తీరుపై విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వీరిద్దరు పార్టీ మారతారనే ప్రచారం జరుగుతోంది. పార్టీ మార్పు అంశాన్ని కోమటిరెడ్డి ఖండించినప్పటికీ.. వరుసగా సభలకు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Tags:    
Advertisement

Similar News