ఆ మాజీ ఎమ్మెల్యే చెరువు కబ్జా చేశారని హైడ్రాకు ఫిర్యాదు
Complaint to HYDRA that the former MLA had occupied the ponds
సంగారెడ్డి అమీన్‌పూర్ మున్సిపాటీలో కబ్జా జరిగిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. ఇవాళ పెద్ద చెరువు, కొత్త చెరువు, శంభునికుంటను పర్యటించారు. చెరువు కబ్జాపై స్థానికులు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. పద్మావతి, వెంకటరమణ కాలనీల్లో కబ్జాలు చేశారని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ రంగనాథ్ పర్యటించి వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మట్లాడారు.
సర్వే చేయించి న్యాయం జరిగేలా చూస్తామని రంగానాథ్ తెలిపారు. హైడ్రా ముఖ్య ఉద్దేశ్యం చేరువుల పునరుద్ధరణ, రోడ్లు, పార్కులను ఆక్రమించకుండా చర్యలు తీసుకోవడమేనని రంగనాథ్ స్పష్టం చేశారు. పెద్ద చెరువు ముంపు బాధితులకు హైడ్రా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అమీన్‌పూర్ పెద్ద చెరువుకు సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. అలుగులు, తూములు మూసేయడంతో ఎఫ్‌టీఎల్ పెరిగినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిని ప్రత్యేక టెక్నికల్ బృందంతో సర్వే చేయిస్తామన్నారు. సర్వే నివేదిక ఆధారంగా ప్రభుత్వంతో చర్చించి మూడు నెలల్లో ఫలితాలతో వస్తామని హామీ ఇచ్చారు.