Case on Devi sri prasad: మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పై సైబర్ పోలీసులకు ఫిర్యాదు..

Case on Devi sri prasad: హిందూ సంఘాలతోపాటు సినీ నటి కరాటే కల్యాణి, దేవిశ్రీపై మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పాటలో సాహిత్యం ఉందని ఆరోపించారు. )

Advertisement
Update:2022-11-02 19:09 IST

Case on Devi sri prasad: మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. ఇటీవల ఆయన విడుదల చేసిన ఓ ప్రైవేట్ ఆల్బమ్ తమ మనోభావాలు దెబ్బతీసిందంటూ హిందూ సంఘాల నేతలు హైదరాబాద్ లోని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హిందూ సంఘాలతోపాటు సినీ నటి కరాటే కల్యాణి, దేవిశ్రీపై మండిపడ్డారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పాటలో సాహిత్యం ఉందని ఆరోపించారు.

హరేరామ హరేకృష్ణ..

దేవిశ్రీ ప్రసాద్ సినిమా సంగీతంతోపాటు ప్రైవేట్ ఆల్బమ్స్ కి కూడా అప్పుడప్పుడు సంగీతాన్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఆయన ఇటీవల 'ఓ తెరి' అంటూ ఓ ప్రైవేట్ సాంగ్ రూపొందించాడు. అందులో సాహిత్యం అంతా బాగానే ఉన్నా.. చివర్లో వచ్చే హుక్ లైన్ మాత్రం తేడా కొట్టేసింది. పాటంతా రొమాంటిక్ గా ఉంటుంది, బికినీలు, షార్ట్ డ్రస్సులతో హాట్ హాట్ గా సాగుతుంది. చివర్లో మాత్రం రామ హరే, కృష్ణ హరే అంటూ హమ్ చేస్తాడు దేవిశ్రీ. ఇదే ఇప్పుడు హిందూ సంఘాల నేతలకు కోపం తెప్పించింది.

Full View

ఆఫీస్ ముట్టడిస్తాం.. జాగ్రత్త

ఐటం సాంగ్ లో హిందూ దేవుళ్ల పేర్లను ఎందుకు వాడుకోవాల్సి వచ్చిందంటూ మండిపడుతున్నారు హిందూ సంఘాల నేతలు. అశ్లీల దుస్తులు, నృత్యాలతో రూపొందిన పాటలో హిందూ దేవుళ్ల పేర్లు ఎందుకని ప్రశ్నిస్తున్నారు కరాటే కల్యాణి. ఆయనపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరారామె. వెంటనే హిందూ సమాజానికి దేవిశ్రీ ప్రసాద్ క్షమాపణ చెప్పాలని, లేకపోతే ఆయన ఆఫీస్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. క్షమాపణ చెప్పి పాటలోని ఆ లిరిక్స్ ని తొలగించాలని డిమాండ్ చేశారు. దీనిపై దేవిశ్రీ ఇంకా స్పందించలేదు.

Tags:    
Advertisement

Similar News