నాగర్‌కర్నూలు సీటు కోసం కాంగ్రెస్‌లో పంచాయితీ

సంపత్‌ సోనియాగాంధీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. దాదాపు 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నప్పటికీ తనకు అన్యాయం జరుగుతోందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు సంపత్‌.

Advertisement
Update:2024-03-21 10:44 IST

కాంగ్రెస్‌లో నాగర్‌కర్నూలు పార్లమెంట్‌ సీటు కోసం పంచాయితీ ముదురుతోంది. మల్లు రవి ఓ వైపు, సంపత్‌ కుమార్‌ మరోవైపు ఈ సీటు కోసం పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీటు మల్లు రవికి ఖరారైందని ప్రచారం జరుగుతుండటంపై సంపత్‌కుమార్ అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే సంపత్‌ సోనియాగాంధీకి లేఖ రాసినట్లు తెలుస్తోంది. దాదాపు 30 ఏళ్లుగా పార్టీని నమ్ముకుని ఉన్నప్పటికీ తనకు అన్యాయం జరుగుతోందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు సంపత్‌. నాలుగు సార్లు ఓడిన మల్లు రవికి టికెట్ ఎలా ఇస్తారని సంపత్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈసారి టికెట్‌ తనకే ఇవ్వాలని లేఖలో సంపత్ కోరారని సమాచారం.ఇప్పటికే మల్లు రవికి ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించారని, కేబినెట్ హోదా కల్పించారని లేఖలో గుర్తు చేశారు సంపత్.

మరోవైపు మల్లు రవి ఈసారి కచ్చితంగా తాను పోటీ చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్లుగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంపీ టికెట్ కోసమే ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా కూడా చేశారు. ఈ ఇద్దరు నేతల వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీకి తలనొప్పిగా మారింది. ఇవాళ లేదా రేపు ఈ అంశంపై క్లారిటీ రానుంది.

Tags:    
Advertisement

Similar News