48 గంటల్లో తేల్చండి.. కాంగ్రెస్‌కు ఎర్రన్నల డెడ్‌లైన్‌.!

సీపీఎం, సీపీఐ చెరో ఐదు స్థానాలు అడిగాయి. అయితే ఈ పొత్తుల అంశంపై జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..లెఫ్ట్ పార్టీ నేతలతో చర్చలు జరిపి చివరకు రెండు సీట్లు ఇచ్చేందుకు ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం.

Advertisement
Update:2023-10-17 07:52 IST

తెలంగాణలో లెఫ్ట్‌ పార్టీలు, కాంగ్రెస్‌ మధ్య సీట్ల పంచాయితీ తెగడం లేదు. సీపీఐ, సీపీఎం చెరో ఐదు సీట్లు కావాలని డిమాండ్ చేస్తే.. తలో రెండు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పింది. అయితే అందులో కూడా ఒకటి వారికి న‌చ్చింది.. మరొకటి ఎక్కడైనా ఇస్తామని కాంగ్రెస్‌ చెప్పినట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనపై ఎర్రన్నలు మండిపడుతున్నారు. ఇచ్చే రెండు సీట్లు తాము కోరిన చోటే ఇవ్వాలని.. అలా అయితేనే పొత్తు ఉంటుందని, లేకపోతే ఒంటరిగానే బరిలోకి దిగుతామని కాంగ్రెస్‌ను బెదిరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని 48 గంటల్లోగా తేల్చాలని డెడ్‌లైన్‌ కూడా పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోతే.. సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి.

సీపీఎం, సీపీఐ చెరో ఐదు స్థానాలు అడిగాయి. అయితే ఈ పొత్తుల అంశంపై జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క..లెఫ్ట్ పార్టీ నేతలతో చర్చలు జరిపి చివరకు రెండు సీట్లు ఇచ్చేందుకు ప్రతిపాదన పెట్టినట్లు సమాచారం. ఇందులోనూ కోరుకున్న స్థానాల్లో ఒకటి.. ఇంకోటి మరోచోట ఇస్తామని తేల్చిచెప్పారు. సీపీఐ కోరుకున్న మునుగోడు లేదా కొత్తగూడెం ఇస్తామని చెప్పగా.. చివరికి కొత్తగూడెంకు సీపీఐ ఓకే చెప్పినట్లు సమాచారం. మరో సీటు చెన్నూరు ఇస్తామని కాంగ్రెస్‌ ప్రతిపాదించినట్లు తెలిసింది. అయితే దీనిపై సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఇక సీపీఎం కోరుకున్న 5 స్థానాల్లో మిర్యాలగూడ సీటు ఇచ్చేందుకు కాంగ్రెస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరోసీటు ఏది ఇస్తారనే దానిపై క్లారిటీ లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమకు తప్పనిసరిగా ఒక సీటు కావాలని సీపీఎం పట్టుబడుతోంది. ఇప్పటికే సీపీఎం కోరిన సీట్లలో భద్రాచలం, మధిరలో కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించేసింది. పాలేరును మాత్రమే పెండింగ్‌లో పెట్టింది. ఈ సీటు కోసం సీపీఎం జాతీయ స్థాయిలో గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. 

Tags:    
Advertisement

Similar News