చలి ఎఫెక్ట్.. స్కూళ్ల పని వేళ్లల్లో మార్పులు
ఉత్తర్వులు జారీ చేసిన ఆదిలాబాద్ కలెక్టర్
Advertisement
చలి పులి పంజా విసురుతుండటంతో విద్యార్థులు, టీచర్లకు ఆదిలాబాద్ కలెక్టర్ గుడ్ న్యూస్ చెప్పారు. జిల్లాలోని అన్ని స్కూళ్లను ఉదయం 9.40 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకే నడిపించాలని ఆదేశాలు జారీ చేశారు. టీచర్ యూనియన్ల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. గురువారం నుంచి అన్ని స్కూళ్లు ఉదయం 9.15 గంటలకు బదులుగా 9.40 గంటలకు ప్రారంభించి సాయంత్రం 4.15 గంటలకు బదులుగా 4.30 గంటల వరకు నడిపించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రైమరీ, హైస్కూళ్లతో పాటు కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ అన్నింటిని సవరించిన పని వేళ్లల్లోనే నడిపించాలని తేల్చిచెప్పారు.
Advertisement