శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.50 కోట్ల డ్రగ్స్ పట్టివేత
లావోస్ నుంచి హైదరాబాద్‌కి వీటిని తరలిస్తుండగా అధికారులు తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. మహిళలు వినియోగించే నాలుగు హ్యాండ్ బ్యాగ్‌ల అడుగు భాగంలో 5 కిలోల కొకైన్‌ను ఉంచి తరలిస్తున్నట్టు తనిఖీల్లో గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు.
హైదరాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.50 కోట్ల విలువైన డ్రగ్స్ ను డీఆర్‌ఐ అధికారులు శనివారం పట్టుకున్నారు. లావోస్ నుంచి హైదరాబాద్‌కి వీటిని తరలిస్తుండగా అధికారులు తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్నారు. మహిళలు వినియోగించే నాలుగు హ్యాండ్ బ్యాగ్‌ల అడుగు భాగంలో 5 కిలోల కొకైన్‌ను ఉంచి తరలిస్తున్నట్టు తనిఖీల్లో గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. ఈ కొకైన్ విలువ రూ.50 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ డ్రగ్స్‌ను లావోస్ నుంచి సింగపూర్ మీదుగా హైదరాబాద్‌కు వచ్చిన ఓ ప్రయాణికుడికి చెందినవిగా గుర్తించారు.
హైదరాబాద్‌కు వచ్చిన అనంతరం తిరిగి ఢిల్లీకి వెళ్లే ప్రయత్నంలో ఉండగా అతన్ని అదుపులోకి తీసుకున్నారు. లావోస్‌లో డ్రగ్స్ ఎవరిచ్చారు.. మన దేశంలో ఎక్కడ, ఎవరికి డెలివరీ చేయనున్నారనే అంశాలపై విచారణ చేపట్టారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో భారీగా డ్రగ్స్ పట్టుబడటం గమనార్హం.