రేవంత్‌కు కరోనా..! - ప్రచారంపై CMO క్లారిటీ

వాస్తవానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. అస్వస్థత కారణంగానే క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నారనే చర్చ జరిగింది.

Advertisement
Update:2023-12-25 15:18 IST

రేవంత్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారనే వార్తల్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది. ఆయన వందశాతం ఆరోగ్యంగా ఉన్నారని క్లారిటీ ఇచ్చింది. సీఎం రేవంత్‌ అస్వస్థతకు లోనయ్యారని ప్రముఖ మీడియాల్లో ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. సీఎంకు జ్వరం వచ్చిందని, గొంతు నొప్పితో బాధపడుతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి. ప్రత్యేక డాక్టర్ల బృందం సీఎం ఇంటికి వచ్చి కరోనా టెస్టు చేసిందనే ప్రచారం కూడా జరిగింది.

వాస్తవానికి సీఎం రేవంత్‌ రెడ్డి ఇవాళ క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొనాల్సి ఉంది. అస్వస్థత కారణంగానే క్రిస్మస్ వేడుకలకు దూరంగా ఉన్నారనే చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలన్నింటిని ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది.

సీఎం రేవంత్‌ రెడ్డి క్షేమంగా ఉన్నారని తెలిపింది. ఇవాళ కూడా సీఎం రేవంత్‌ రెడ్డిని మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ కలిశారు. ఇంకొందరు ముఖ్య అధికారులు సీఎంతో భేటీ అయ్యారు. నిన్న కూడా సెక్రటేరియట్‌లో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో పాల్గొన్నారు సీఎం. కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలతో సుదీర్ఘంగా చర్చించారు. తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని.. అయితే, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఊరుకునేది లేద‌ని హెచ్చరించారు.

Tags:    
Advertisement

Similar News