ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను ఆవిష్కరించిన సీఎం
మొబైల్ యాప్ ద్వారా శుక్రవారం నుంచి లబ్ధిదారుల నమోదు
ఇందిరమ్మ ఇళ్ల పథకం యాప్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. మొబైల్ యాప్ ద్వారా శుక్రవారం నుంచి లబ్ధిదారులను నమోదు చేయనున్నారు. ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్ ఏర్పాటు చేయనున్నారు. మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. నాలుగున్నర లక్షల ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గ్రామసభల్లో ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హుల ఎంపిక చేయనున్నారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. 'రోటీ, కపడా, ఔర్ మకాన్ అనేది ఇందిరమ్మ నినాదం. ఇల్లు, వ్యవసాయ భూమిని ప్రజలు ఆత్మగౌరవంగా భావిస్తారు. అందుకే ఇందిరాగాంధీ దశాబ్దాల కిందటే ఇళ్లు, భూపంపిణీ పథకాలను ప్రారంభించింది. దేశంలో గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ.. ఇందిరమ్మ కాలనీ లేని ఊరు లేదు. రూ. 10 వేలతో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల పథకం నేడు రూ. 5 లక్షలకు చేరుకున్నది. ఇంటి నిర్మాణం ప్రతి పేదవాడికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నాం. అర్హులైన వారికే ప్రభుత్వ ఇల్లు చెందాలన్నది మా లక్ష్యం. తొలి దశలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చాం' అని సీఎం తెలిపారు.