ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ సమావేశం

రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కంపెనీని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. కంపెనీ పురోగతి, ఇతర అంశాలను ఫాక్స్‌కాన్ ప్రతినిధులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

Advertisement
Update:2024-10-14 19:01 IST

రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కంపెనీని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సందర్శించారు. కంపెనీ పురోగతి, ఇతర అంశాలను ఫాక్స్‌కాన్ ప్రతినిధులను సీఎం అడిగి తెలుసుకున్నరు. ఫాక్స్ కాన్ చైర్మన్ యాంగ్ లియూ తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ముఖ్యమంత్రి మాట్లాడారు. కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదని సీఎం భరోసా ఇచ్చారు.

ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఫాక్స్ కాన్ కంపెనీని సీఎం కోరారు.గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో 2023లో ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణకు వచ్చింది.. కొంగరకలాన్‌లో 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటు చేయాలని ఫాక్స్ కాన్ నిర్ణయించింది. దాదాపు లక్ష మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఫాక్స్‌కాన్ సీఈవో యంగ్ లియు పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్‌ పరిశ్రమకు మాజీ మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 35,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

Tags:    
Advertisement

Similar News