సీఎం రేవంత్ కీలక సమావేశం..నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చ

సీఎం రేవంత్‌రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ భేటీ అయ్యారు.

Advertisement
Update:2024-11-20 21:29 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ ముస్తీ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ తోపాటు, మంత్రి ఉత్తమ కుమార్ గౌడ్ కూడా పాల్గొన్నారు. అయితే ఈ అత్యవసర సమావేశానికి గల కారణం రాష్ట్రంలోని వివిధ నామినేటెడ్ పోస్టుల భర్తీ అని సమాచారం. అయితే ఈ మీటింగ్ పై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. నామినేటెడ్ పదవుల కీలక చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

రేవంత్‌రెడ్డితో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ భేటీ అయ్యారు.రేపు గాంధీ భవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారని తెలుస్తుంది. ఆ క్రమంలో రేవంత్ సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతుంది. దీంతో సంబరాలు చేయాలని నిర్ణయించారు. అలాగే డిసెంబర్ 4 , లేదా 5వ తేదీన బహిరంగ సభ నిర్వహించాలనుకుంటున్నారు.

Tags:    
Advertisement

Similar News