బీజేపీ కోసం రేవంత్ కష్టం.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

కేంద్రంలో ఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యత వచ్చే అవకాశాలు లేవని మరోసారి స్పష్టం చేశారు కేటీఆర్. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమే కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు.

Advertisement
Update:2024-05-14 17:00 IST

బీజేపీని గెలిపించేందుకు ఆ పార్టీ స్టేట్ చీఫ్‌ కిషన్ రెడ్డి కంటే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువ కష్టపడ్డారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఆరు నుంచి ఏడు సీట్లలో డమ్మీ అభ్యర్థులను పెట్టి కాంగ్రెస్ బీజేపీకి సహకరించిందన్నారు. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అన్నట్లుగా బీజేపీ-కాంగ్రెస్ వ్యవహారం ఉందన్నారు కేటీఆర్. రెండు జాతీయ పార్టీలకు బీఆర్ఎస్ చెమటలు పట్టించిందన్నారు.

కేంద్రంలో ఏ కూటమికి స్పష్టమైన ఆధిక్యత వచ్చే అవకాశాలు లేవని మరోసారి స్పష్టం చేశారు కేటీఆర్. ప్రాంతీయ పార్టీలతో ఏర్పడే కూటమే కేంద్రంలో అధికారంలోకి వస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు అద్భుతంగా పని చేశారన్నారు కేటీఆర్. గ్రామీణ ఓటర్లు బీఆర్ఎస్‌ వైపే ఉన్నారన్నారు కేటీఆర్.

ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు కేటీఆర్. అనేక హామీల విషయంలో కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. రుణమాఫీ, రైతుభరోసా విషయంలో రైతులు, నెలకు రూ. 2500 ఆర్థిక సాయం విషయంలో మహిళలు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కోపంతో ఉన్నారన్నారు.

Tags:    
Advertisement

Similar News