Ntv ఛైర్మన్ ఇంటికి సీఎం రేవంత్.. కీలక పదవి ఇస్తారంటూ ప్రచారం..?
సీఎం రేవంత్ నరేంద్ర చౌదరి ఇంటికి వెళ్లడంపై మీడియా సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. నరేంద్ర చౌదరికి భవిష్యత్తులో రాజ్యసభ ఇస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.
ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ NTV అధినేత నరేంద్ర చౌదరి నివాసానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని సత్కరించారు నరేంద్ర చౌదరి.
సీఎం రేవంత్ నరేంద్ర చౌదరి ఇంటికి వెళ్లడంపై మీడియా సర్కిల్స్‌లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. నరేంద్ర చౌదరికి భవిష్యత్తులో రాజ్యసభ ఇస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎవరూ అధికారికంగా ప్రకటన చేయలేదు. ఈ సందర్భంగా ఖమ్మం ఎంపీ టికెట్‌పైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. నరేంద్ర చౌదరి ఖమ్మంకు చెందిన వ్యక్తి కావడంతో ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం.
ఇటీవల ఈనాడు సంస్థల అధినేత రామోజీ రావును సైతం కలిశారు సీఎం రేవంత్ రెడ్డి. తాజా రాజకీయ అంశాలపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి వరుసగా మీడియా అధినేతలను కలవడం చర్చనీయాంశంగా మారింది.