లిక్కర్ ధరలు భారీగా పెంచేందుకు రేవంత్ స్కెచ్!
బీఆర్ఎస్ హయంలో మద్యం అమ్మకాలపై రాద్ధాంతం చేసిన వాళ్లే ఇప్పుడు మద్యం అమ్మకం ద్వారా రూ. 5,700 కోట్ల అధిక రాబడిని సమకూర్చుకోవాలని బడ్జెట్ అంచనాలు పొందుపరిచారు.
రాబోయే రోజుల్లో తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెంచబోతున్నారని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు. బడ్జెట్ అంచనాలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోందన్నారు. లిక్కర్ పాలసీ విషయంలో కాంగ్రెస్ నాయకులు తలదించుకోవాలన్నారు హరీష్‌రావు. "2023-24 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ. 19,884 కోట్ల ఆదాయాన్ని గత BRS ప్రభుత్వం పెట్టుకుంటే, 2024-25కు గాను కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 25,617 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేశారు. రూ. 5,773 కోట్లు అదనంగా అంచనా వేసుకున్నారు. అంటే దీన్నిబట్టి బీర్లు, లిక్కర్ రేట్లు రాబోయే రోజుల్లో భారీగా పెంచబోతున్నారు".
"బీఆర్ఎస్ హయంలో మద్యం అమ్మకాలపై రాద్ధాంతం చేసిన వాళ్లే ఇప్పుడు మద్యం అమ్మకం ద్వారా రూ. 5,700 కోట్ల అధిక రాబడిని సమకూర్చుకోవాలని బడ్జెట్ అంచనాలు పొందుపరిచారు. ఎక్సైజ్, వ్యాట్ కలిపి మొత్తం 42 వేల కోట్ల 49 రూపాయలు మద్యం మీద ఆదాయం సంపాదిస్తామని బడ్జెట్‌లో పెట్టారు. నాడు గ్రామాల్లో బెల్ట్ షాపు.. ఇప్పుడు గల్లీకో బెల్ట్ షాపు పెట్టే పరిస్థితి వచ్చింది. బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి ఇప్పుడు రూ. 42వేల కోట్ల ఆదాయం తెచ్చుకునే ప్లాన్ చేస్తున్నారు" అని హరీష్‌రావు మండిపడ్డారు.