ధరణిపై రేవంత్ షాకింగ్ డెసిషన్.. రద్దు చేస్తారా..?
ఎన్నికలకు ముందు ధరణిపై సంచలన ఆరోపణలు చేసింది కాంగ్రెస్. ధరణి చాటుగా అక్రమాలు జరిగాయని ఎన్నికల ప్రచారంలో చెప్పింది.
భూముల రికార్డుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి కారణంగా తలెత్తిన సమస్యలపై అధ్యయనంతో పాటు పరిష్కార మార్గాలు చూపించేందుకు కమిటీ ఏర్పాటు చేసింది రేవంత్ సర్కార్. ఐదుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ జీవో రిలీజ్ చేశారు.
కమిటీలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎం. కోదండ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ రేమండ్ పీటర్, అడ్వకేట్, భూ చట్టాల నిపుణుడు సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి.మధుసూదన్‌తో పాటు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ - CCLA మెంబర్ కన్వీనర్‌గా కమిటీలో ఉండనున్నారు.
ఈ కమిటీ ధరణి సమస్యలపై అధ్యయనంతో పాటు పోర్టల్‌ను రీస్ట్రక్చరింగ్ చేసేందుకు వీలైనంత త్వరగా సూచనలు చేయనుంది. ఈ కమిటీకి రెవెన్యూ శాఖ అధికారులు పూర్తిగా సహకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్లు, రెవెన్యూ ఆఫీసర్లు సైతం కమిటీకి సహకరించాలని సూచించింది. ఎన్నికలకు ముందు ధరణిపై సంచలన ఆరోపణలు చేసింది కాంగ్రెస్. ధరణి చాటుగా అక్రమాలు జరిగాయని ఎన్నికల ప్రచారంలో చెప్పింది. అధికారంలోకి వస్తే ధరణి రద్దు చేసి.. కొత్తగా పోర్టల్ తీసుకువస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్. అయితే పూర్తి పోర్టల్‌ను రద్దు చేయకుండా మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.